ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  అర్హులకు తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు అందాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అర్హులకు తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు అందాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం అమలు విషయాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఇప్పటికే మొదటి విడతలో ప్రతి మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామపంచాయతీల్లో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

అర్హుల ఎంపిక ప్రక్రియలో నియోజకవర్గ ప్రత్యేకాధికారులు తమ వద్ద ఉన్న జాబితాలను ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లకు అందజేసి, వారు స్థానిక ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని అసలైన నిరుపేదులను గుర్తించాలన్నారు. జాబితాలో పేరు లేనివారు అర్హులు అయితే, వారి పేర్లను కూడా చేర్చాలని తెలిపారు.

సమగ్రమైన అర్హుల జాబితాను స్థానిక శాసనసభ్యుల సహకారంతో సిద్ధం చేయాలని, ఇందు ద్వారా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరుతాయని కలెక్టర్ అన్నారు. అన్ని పథకాలు లక్ష్యాన్ని చేరేందుకు అధికారులు చురుకైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….