వ్యక్తిపై హత్యాయత్నం
పినపాక, జూన్ 10 (ఆధాబ్ న్యూస్):
మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన తాటి జంపయ్య కుమారుడు తాటి రమేష్ ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని ఇంటికి వచ్చి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తి 8 ఎంఎం ఇనుప కడ్డీతో ఛాతిపై హఠాత్తుగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన రమేష్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రతిఘటించగా, దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఈ సంఘటనపై ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









