ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  అన్నకు తల కొరివి పెట్టిన చెల్లి… కన్నీరు పెట్టించిన కరకగూడెం విషాదం

అన్నకు తల కొరివి పెట్టిన చెల్లి…
కన్నీరు పెట్టించిన కరకగూడెం విషాదం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
జీవితంలో కొన్ని ఘటనలు కేవలం వార్తలుగానే మిగలవు… మనసును ముక్కలుగా చేసే జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం అలాంటి హృదయ విదారక దృశ్యానికే నిదర్శనంగా నిలిచింది.

జరిగిన ఈ ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కరకగూడెం గ్రామానికి చెందిన ఆడెపు సతీష్ తన భార్య స్వప్న, కుమారుడు మనోహర్‌తో కలిసి భద్రాచలం ఆసుపత్రికి వెళ్తుండగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల మనోహర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు సతీష్, స్వప్న ప్రస్తుతం ఆసుపత్రిలో కోమా స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఇంటి పెద్దలు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతుండగా… కుటుంబంలో ఆధారంగా నిలవాల్సిన కుమారుడు శవపేటికలో కనిపించడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. అయితే అందరినీ మరింత కంటతడి పెట్టించిన దృశ్యం మాత్రం మనోహర్ చెల్లెలు మాధురి చేసిన చివరి కర్తవ్యం.

సాధారణంగా తల్లిదండ్రులు లేదా పెద్దలు నిర్వహించే అంత్యక్రియల్లో… చిన్న వయసులోనే మాధురి తన అన్నకు తల కొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. కన్నీళ్లతో వణికిపోతూ, గుండె నొప్పిని దాచుకుంటూ చెల్లెలు చేసిన ఆ కర్తవ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.

“అన్నను ఇలా సాగనంపాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు” అంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి వయసులోనే ఇంతటి విషాదాన్ని భరించాల్సి రావడం చూసి మహిళలు విలపించగా, యువకులు సైతం కన్నీరు ఆపుకోలేకపోయారు.

ఒక ప్రమాదం…
ఒక కుటుంబం ఆనందాన్ని క్షణాల్లో చిదిమేసింది.
అన్నకు చివరి వీడ్కోలు చెప్పిన చెల్లెలి ఆ దృశ్యం కరకగూడెం ప్రజల మనసుల్లో ఎన్నాళ్లకైనా చెరగని ముద్రగా మిగిలిపోనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….