అక్రమంగా పశువుల రవాణా.. ముగ్గురిపై కేసు నమోదు. అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామం నుండి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి చెందిన కుర్ర హనుమాన్, బానోతు సురేష్, భూక్య సాగర్ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న మూడు పశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పశువులను రవాణా చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 19









