ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సారపాక తాళ్లగొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

సారపాక తాళ్లగొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

భద్రాచలం మే 23 (ఆధాబ్ న్యూస్):
మణుగూరు నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటో సారపాక తాళ్లగొమ్మూరు సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన వారు కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇప్పటికే గత సంవత్సరం ట్రాక్టర్ టైరుకు గాలి పెడుతున్న సమయంలో టైరు పేలి ఆడెపు సతీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో చావుబతుకుల మధ్య బయటపడ్డాడు. అలాంటి ప్రమాదం నుండి కోలుకున్న సతీష్ కుటుంబానికి మళ్లీ ఇలాంటి విషాద ఘటన జరగడం స్థానికులను కలచివేసింది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్