కరకగూడెంలో పారిశుధ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు
ఆధాబ్ న్యూస్ , కరకగూడెం మే 19:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట ఉన్న కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన వ్యాపించి స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా దోమలు విపరీతంగా పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రజలు చెబుతున్నారు.
కాల్వల శుభ్రత పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాకాలంలో ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలను శుభ్రపరచి దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 118









