ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  చావుబతుకుల మధ్య పసికందు… కన్నీటి కడలిలో కుటుంబం, అండగా నిలిచిన ఖాకీ మనసు!

చావుబతుకుల మధ్య పసికందు… కన్నీటి కడలిలో కుటుంబం, అండగా నిలిచిన ఖాకీ మనసు!
మహబూబాబాద్,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బూరుగు గుంపు గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లెల అశ్విని – మహేష్ దంపతుల మూడునెలల పసికందు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రి పడకపై ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆ చిన్నారి నవ్వులతో కళకళలాడాల్సిన ఇల్లు, ఇప్పుడు కన్నీటి గూడుగా మారింది.

ఆసుపత్రి ఖర్చులు భారంగా మారడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కృంగిపోయారు. “మా బిడ్డను కాపాడండి” అంటూ వారి ఆవేదన ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది.

ఈ పరిస్థితిని తెలుసుకున్న కొత్తగూడ ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. మానవత్వంతో ముందుకు వచ్చి రూ. 4,000 నగదు సహాయం అందజేశారు. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న మానవత్వాన్ని ఆయన మరోసారి చాటిచెప్పారు.

ఎస్ఐ అందించిన ఈ చిన్న సహాయం ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. విధి నిర్వహణతో పాటు మానవతా విలువలను నిలబెట్టిన ఎస్ఐపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….