ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత – ఘనంగా సన్మానం

పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత – ఘనంగా సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో గ్రామంలో పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయితీ పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ వారికి పీపీఈ (PPE) కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను గుర్తిస్తూ వారిని ఘనంగా సన్మానించారు.

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ తెలిపారు. వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని పీపీఈ కిట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇర్ప కుశేలుడు, గుడ్ల రంజిత్, పంచాయతి కార్యదర్శి జిమ్మిడి విజయ్, మాజీ జెడ్పిటిసి కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులు తమకు గుర్తింపు ఇచ్చి గౌరవించినందుకు గ్రామపంచాయితీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….