సిపిఐ సీనియర్ నాయకుడు పులి కృష్ణ దశదిన కర్మలు నిర్వహణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
శివలింగాపురం గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సింగరేణి ఉద్యోగి, కల్లుగీత కార్మిక సంఘం మండల నాయకుడు పులి కృష్ణ దశదిన కర్మలు ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర సమితి సభ్యుడు సి. రెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, రైతు సంఘం జిల్లా నాయకుడు మంగి వీరయ్య, ఏఐటియుసి కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, కార్యవర్గ సభ్యుడు నోముల రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు పులి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
Post Views: 76









