ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మల్లూరు దేవాలయానికి మంత్రుల రాక – ఘన స్వాగతం

మల్లూరు దేవాలయానికి మంత్రుల రాక – ఘన స్వాగతం
మంగపేట,ఆధాబ్ న్యూస్:
మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రాష్ట్ర మంత్రులు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దేవాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, డోలు వాయిద్యాల నడుమ మంత్రులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి, ఈఓ మహేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్