ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బస్సు ప్రమాదంపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి
రంగారెడ్డి,ఆధాబ్ న్యూస్:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

గాయపడిన ప్రయాణికులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్