ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇరవండి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి బాలికపై ప్రధానోపాధ్యాయుడి దాడి!

ఇరవండి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి బాలికపై ప్రధానోపాధ్యాయుడి దాడి!
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవండి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల సాయి శ్రీ అనే బాలికను స్కూలు ప్రధానోపాధ్యాయుడు విచక్షణరహితంగా కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

వారి ప్రకారం, చిన్నపాటి తప్పిదానికి కూడా ప్రధానోపాధ్యాయుడు బాలికను తీవ్రంగా కొట్టి, కన్ను, చెవిపక్క రక్తం వచ్చేలా దాడి చేశాడని తెలిపారు. ఈ ఘటనతో బాలిక తీవ్ర భయాందోళనలకు గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. స్థానికులు కూడా ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులపై ఇలాంటి హింసాత్మక ప్రవర్తన ఆందోళన కలిగించేదని పలువురు తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్