ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శంషాబాద్ విమానాశ్రయంలో ₹14 కోట్ల గంజాయి

శంషాబాద్ విమానాశ్రయంలో ₹14 కోట్ల గంజాయి పట్టివేత

సిటిజన్ టైమ్స్, ఆధాబ్ న్యూస్:

శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు దగ్గర 13.9 కిలోల గంజాయిను పట్టుకున్నారు.

నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు ₹14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

డ్రగ్స్‌ అక్రమ రవాణా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈగల్‌ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్రంలో తరచూ గంజాయి, మత్తు పదార్థాల దందాలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్