ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మెగా ఆధార్ క్యాంపుల ద్వారా 3,700కి పైగా సమస్యలకు పరిష్కారం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మెగా ఆధార్ క్యాంపుల ద్వారా 3,700కి పైగా సమస్యలకు పరిష్కారం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందనను పొందాయి. ఈ క్యాంపుల ద్వారా మొత్తం 3,772 ఆధార్ సమస్యలు పరిష్కరించబడ్డాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు.

ఈ మూడు రోజుల క్యాంపులలో భాగంగా:

కొత్త ఆధార్ నమోదు‌లు – 489

వయోవృద్ధులకు సేవలు – 45

వికలాంగుల నమోదు – 12

ట్రాన్స్జెండర్ నమోదు – 1

బయోమెట్రిక్ & ఇతర అప్డేట్లు – 602

పుట్టిన తేది సవరణలు (DOB లిమిట్ కేసులు) – 5

ఆధార్ రద్దు కేసులు – 2

సాధారణ ఎంక్వయిరీలు – సుమారు 50

ఈ కార్య‌క్ర‌మాల ద్వారా పదివేలకి పైగా ప్రజలు హాజరయ్యారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారు, వాటిని సేకరించి మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేయాలని కలెక్టర్ సూచించారు.

చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ సంబంధిత సమస్యలు ఈ మెగా క్యాంపుల ద్వారా త్వరితగతిన పరిష్కారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించి తక్షణ ఫలితాలు ఇవ్వడం ఈ క్యాంపుల ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.

మండలాల వారీగా నిర్వహించే అభిమాన మెగా ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాష్ట్ర యుఐడిఐ బృందం, జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, రెవెన్యూ మరియు ఐటీ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్