ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ: సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం

తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ: సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిధుల జమ ప్రక్రియ ప్రారంభించింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతులకు నిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా 70,11,984 మంది అన్నదాతల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు వస్తాయి. వారం రోజుల్లో అందరికీ డబ్బులు జమ అవుతాయి” అని స్పష్టం చేశారు.

ఈ నిధులు రైతులకు సకాలంలో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కీలకంగా మారనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్