ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పిడుగుపాటుతో వ్యక్తి మృతి – గ్రామంలో విషాద ఛాయలు

పిడుగుపాటుతో వ్యక్తి మృతి – గ్రామంలో విషాద ఛాయలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని రేగులగండి గ్రామంలో పిడుగుపాటు విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన కుంజ జగన్ (40) మృతిచెందిన దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది.

వర్షం వస్తుండగా తన పనుల్లో ఉన్న క్రమంలో అకస్మాత్తుగా పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుంజ జగన్‌ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

మృతుడికి భార్యతో పాటు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆదాయ జగన్ను కోల్పోవడంతో ఆ కుటుంబం గాఢవిషాదంలో మునిగిపోయింది. సంఘటనపై అధికారులు స్పందించి తగిన సానుభూతి వ్యక్తం చేశారు. సహాయనిధులు విడుదల చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్