ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కార్మిక వర్గ ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ : రాష్ట్ర నేతలు

కార్మిక వర్గ ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ : రాష్ట్ర నేతలు

రామగుండం,ఆధాబ్ న్యూస్: ప్రపంచ కార్మిక వర్గానికి ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ అని రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నాగేశ్ పేర్కొన్నారు. రామగుండం మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్ల్ మార్క్స్ 208వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, నాయకులు మాట్లాడుతూ — కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం ఎంతో గొప్పదని తెలిపారు. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతుండగా, వర్గ పోరాటాన్ని మార్క్స్ ఉధృతం చేశారని వివరించారు. సమాజంలో తిండి, ఇల్లు, బట్ట లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధమవ్వాలన్నారు.

పేదల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కార్పొరేట్ల సంపద అదే స్థాయిలో పెరుగుతోందని చేస్తూ, ధనిక–పేదల మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు మార్క్సిజం ముఖ్య సాధనమని తెలిపారు. కార్మిక వర్గం కుల, మత భేదాలు దాటి శ్రమ ప్రాతిపదికన ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మార్క్స్ జీవితంలోని త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాసరాజయ్య, సమతా సైనిక దళ్ నాయకులు చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, దుర్గం వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!