లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి : సీఐ ఎల్లయ్య
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ : వాహనాలు నడిపే ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని అశ్వాపురం సీఐ ఎల్లయ్య సూచించారు. స్థానిక ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యతగా భావించి ఆటో డ్రైవర్లు విధులు నిర్వహించాలని కోరారు.
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సీఐ ఎల్లయ్య తెలిపారు.
Post Views: 6








