ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

 

మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

మణుగూరు, జూన్ 23 (ఆధాబ్ న్యూస్): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి సారించాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణ జ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు జి. నాగశ్రీ, సీఐ నాగబాబు, ఎస్సై రవూఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్