ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో ఎండల తీవ్రత.. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

 

తెలంగాణలో ఎండల తీవ్రత.. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, మే 22 (ఆధాబ్ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

వేసవి ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం మంచిదని అధికారులు తెలిపారు. 🔆✅

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్