ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పెన్షన్ లబ్ధిదారులకు విజ్ఞప్తి

పెన్షన్ లబ్ధిదారులకు విజ్ఞప్తి

కరకగూడెం, మే 19 (ఆధాబ్ న్యూస్):

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని పెన్షన్ లబ్ధిదారులందరూ ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ చేయించుకోవాలని మండల ప్రజా పరిషత్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియను ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పెన్షన్ లబ్ధిదారులు తమ గ్రామ కార్యదర్శిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

అలాగే మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్