ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ముగిసిన మహిళా సమాఖ్యల శిక్షణా కార్యక్రమం

ముగిసిన మహిళా సమాఖ్యల శిక్షణా కార్యక్రమం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యల పాలకవర్గ సభ్యులకు రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సెర్ప్ రాష్ట్ర స్థాయి స్టేట్ రిసోర్స్ పర్సన్‌లు నిర్వహించారు.

శిక్షణలో భాగంగా గ్రామాల్లో సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం, పొదుపులు మరియు అప్పుల చెల్లింపులు సక్రమంగా చేయడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మహిళల సమస్యలకు సంబంధించిన “జెండర్” అంశంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. సమాఖ్య సభ్యులతో జెండర్ ప్రతిజ్ఞ కూడా చేయించారు.

ఈ కార్యక్రమాన్ని సెర్ప్ ఏపీఎం బి. వినోద్ క్రాంతి ఆధ్వర్యంలో స్టేట్ రిసోర్స్ పర్సన్‌లు బి. జ్యోతి, కె. దీవెన నిర్వహించారు. ఈ శిక్షణలో సీసీలు పి. విజయలక్ష్మి, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు పోలేబోయిన సరస్వతి, అకౌంటెంట్ ప్రీతీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….