ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆధాబ్ న్యూస్,కరకగూడెం:
మొగిలితోగు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తొలెం రాంబాబు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, డీసీఎం వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 36









