ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా

ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో ఇంటర్మీడియట్ మరియు పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు నిర్వహించి, వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ అధికారులతో కలిసి పలు అంశాలపై ఆయన సమీక్షించారు.

జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండ ప్రాంతాల్లో జరుగుతున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మే 13 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

అలాగే పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. మండలాల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, విద్యార్థుల లోపాలను గుర్తించి లక్ష్యబద్ధంగా బోధన అందించాలని తెలిపారు.

జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 12 నుంచి విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….