సీఎంఆర్ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు భరోసా : ఎమ్మెల్యే పాయం
ఆధాబ్ న్యూస్ ,మణుగూరు:
నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని పినపాక నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మణుగూరు పట్టణంలోని డీవీ ఫంక్షన్ హాల్లో అశ్వాపురం మండలానికి చెందిన 12 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకునే పేదలకు సైతం తిరిగి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు.
అశ్వాపురం మండలానికి చెందిన 12 మంది బాధితులకు సుమారు రూ.5 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, సర్పంచులు కోర్స క్రిష్ణ, తెల్లం నాగమణి, సరిత, మట్ల నర్సింహారావు, నాయకులు రమేష్ బాబు, వేముల విజయ్, లంకమల్ల కొండలరావు, భూరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








