అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్ఫోన్లు పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలల భద్రత, చైల్డ్ ప్రొటెక్షన్, మాదకద్రవ్యాల వినియోగ నివారణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, టీనేజ్ గర్భధారణలు మరియు ఎలొప్మెంట్ కేసుల నివారణపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ స్థాయిలో బాలల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ఫోన్ల ద్వారా పిల్లల వివరాల నమోదు, పోషకాహార పర్యవేక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా, కార్యక్రమంలో 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వట్టం కాంతయ్య, ఎంపీడీవో డి.వి. కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్ఫూర్తి, ఆర్ఐ, జిపిఓ, జిపి సెక్రటరీ, మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాగబండి వెంకటేశ్వర్లు, ఎర్ర సురేష్, పోలేబోయిన తిరుపతయ్య, తొలెం నాగేశ్వరావు, రాందాస్ నాయక్, కృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








