కరకగూడెం: బంకుల్లో డీజిల్ అందుబాటులో – బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండలంలో ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. స్థానిక బంకుల్లో డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కరకగూడెం ఎస్ఐ పీవీ ఎన్ రావు మాట్లాడుతూ, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
అదేవిధంగా, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
Post Views: 39








