ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  నేతకానిల అస్తిత్వాన్ని కాపాడాలి: మంత్రి శ్రీధర్ బాబుకు సమత సైనిక్ దళ్ వినతి

నేతకానిల అస్తిత్వాన్ని కాపాడాలి: మంత్రి శ్రీధర్ బాబుకు సమత సైనిక్ దళ్ వినతి

హైదరాబాద్‌, ఏప్రిల్ 22 (ఆధాబ్ న్యూస్):
నేతకాని కులస్తుల చారిత్రక అస్తిత్వాన్ని కాపాడాలని, ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-ఏ కింద 3 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు వినతిపత్రం సమర్పించింది.

బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ పలు కీలక డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ రికార్డుల్లో నేతకాని కులాన్ని ‘మాలసాలె’ లేదా ‘నెట్కాని’గా తప్పుగా నమోదు చేయడం వల్ల తమ సామాజిక గుర్తింపు దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతకాని ఒక స్వతంత్ర సామాజిక వర్గమని, గెజిట్‌లో ఉన్న తప్పుడు పేర్లను తొలగించి ‘నేతకాని’గా మాత్రమే నమోదు చేయాలని కోరారు.

రాష్ట్రంలో సుమారు 15 లక్షలకు పైగా జనాభా ఉన్న నేతకానిలు విద్యా, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రస్తుత వర్గీకరణ వల్ల తగిన న్యాయం జరగడం లేదని తెలిపారు. తమను గ్రూప్-ఏలో చేర్చి 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కుల గణనలో జనాభా లెక్కలను శాస్త్రీయంగా ధృవీకరించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, నేతకాని సామాజిక వర్గ సమస్యలను క్యాబినెట్ స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముడీమడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….