ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేగులగండి చెరువులో విషాదం – 9వ తరగతి విద్యార్థి గల్లంతు

రేగులగండి చెరువులో విషాదం – 9వ తరగతి విద్యార్థి గల్లంతు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజ్ఞాన పాఠశాలకు చెందిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు శుక్రవారం పాఠశాల అనంతరం రేగులగండి చెరువులో స్నానానికి దిగగా, వారిలో హర్షవర్ధన్ (14) అనే విద్యార్థి చెరువులో గల్లంతయ్యాడు.

విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి: బొర్రా శశిధర్ (14), పీవీ కాలనీ; పేరూరి గిరిధర్ (14), అశ్వాపురం మండలం; హర్షవర్ధన్ (14), ఆదర్శనగర్, మణుగూరు. ముగ్గురు కలిసి చెరువులోకి దిగగా, హర్షవర్ధన్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే సీఐ నాగబాబు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో హర్షవర్ధన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!