పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స
ఏపీ,ఆధాబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.
కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. స్కాన్ నిర్వహించారు.
పరీక్షల నివేదికలను పరిశీలించిన అనంతరం శస్త్ర చికిత్స అవసరమని నిర్ణయించిన వైద్యులు, శనివారం సాయంత్రం ఆపరేషన్ నిర్వహించారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి కోలుకోవడానికి మరికొంతకాలం జాగ్రత్తలు అవసరమని సూచించారు.








