భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నిక – కరకగూడెం నాయకత్వానికి కీలక స్థానాలు
కరకగూడెం, ఏప్రిల్ 14 (ఆధాబ్ న్యూస్): డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ సంస్థ నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. పాల్వంచ పట్టణంలోని కొమరం భీమ్ భవనంలో నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు.
హక్కుల పరిరక్షణలో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కరకగూడెం మండల నాయకత్వానికి ప్రముఖ స్థానం లభించింది.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలెబోయిన వెంకటనారాయణ ఎన్నిక కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కలం వేణుగోపాల్, ప్రచార కార్యదర్శిగా సుతారి నాగేశ్వరావు ఎంపికయ్యారు. అదేవిధంగా ASU ఉపాధ్యక్షుడిగా ఇర్ప నాగకృష్ణ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తుడుం దెబ్బ సంస్థ ద్వారా గిరిజనులు మరియు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.








