ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
సోమవారం (ఏప్రిల్ 13) కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
ప్రజల నుండి అందిన వినతులను అధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై తగిన చర్యలు తీసుకునేలా చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Post Views: 9








