గ్రామోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
గ్రామోత్సవ కార్యక్రమాలలో భాగంగా అశ్వాపురం పాడు గుత్తి కోయ గ్రామంలో చదువులో ప్రతిభ కనబరుస్తూ, ఉద్యోగాలు సాధించిన మరియు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రావు విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందించారు. విద్యార్థులు తమ కృషితో ఉన్నత స్థానాలకు చేరుకోవడం గ్రామానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, గ్రామ సెక్రటరీ రామకృష్ణ, ఎస్ఐ పి.వి.ఎన్. రావు, పోలీసు సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాలతో సాగింది.
Post Views: 92








