ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కాంగ్రెస్ పాలనపై ప్రజలకు నమ్మకం కోల్పోయింది: రావుల సోమయ్య

కరకగూడెం ,ఆధాబ్ న్యూస్:
గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

నిన్న గజ్వేల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖను తన దగ్గర ఉంచుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రజా పాలన పేరుతో రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేస్తున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో మండల నాయకులు బుడగం రాము, కొమరం రాంబాబు, రేగా సత్యనారాయణ, కొమరం సత్యనారాయణ, పాయం కృష్ణ, అత్తె ముకుందరావు, అత్తె సత్యనారాయణ, చెన్నోజు రాజేశ్వరరావు, పసునూరి అంజయ్య, మొగిలిపువ్వు వెంకన్న, అత్తె రమేష్, నిట్ట ఏడుకొండలు, గోగ్గలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….