అనంతారం గ్రామంలో మెడికల్ క్యాంప్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో
మణుగూరు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను పొందారు.
ఈ శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ముఖ్యంగా జ్వరాలు, రక్తపోటు, షుగర్ వంటి సమస్యలపై వైద్యులు పరీక్షలు చేసి తగిన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరశేఖర్, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ బుడగం రామకృష్ణ, డాక్టర్ ఉమా శంకర్, డాక్టర్ సంజీవరావు తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.
గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి మంచి స్పందన తెలుపుతూ, ఇలాంటి వైద్య శిబిరాలు తరచుగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందం, గ్రామ పెద్దలు, వాలంటీర్లను నిర్వాహకులు అభినందించారు.









