ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి.

గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి.
పినపాక, ఆధాబ్ న్యూస్:
గజ్వేల్‌లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

మండలంలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు క్యాంపు కార్యాలయంలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు గోడలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను బలవంతంగా ఏర్పాటు చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.

ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపిస్తూ, అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

హేట్ స్పీచ్ బిల్లుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మరోవైపు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండారాజ్యం నడుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అణచివేతలకు భయపడదని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….