మానవత్వం చాటుకున్న ఎస్సై పీవీ నాగేశ్వరరావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పీవీ నాగేశ్వరరావు నిలిచారు. మండలంలోని వట్టంవారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తున్న ఓర్సు మల్లయ్య (సుమారు 75 సంవత్సరాలు) గత కొన్ని నెలలుగా భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై మానసిక స్థితి కోల్పోయి గ్రామంలో నిరాశ్రయుడిలా తిరుగుతూ దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన ఎస్సై నాగేశ్వరరావు వెంటనే స్పందించి, మల్లయ్యను తన వద్దకు తీసుకువచ్చి కటింగ్, షేవింగ్ చేయించి శుభ్రపరిచారు. అనంతరం అతనికి కొత్త దుస్తులు అందజేసి, పౌష్టికాహారం కూడా అందించారు. అంతేకాకుండా అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన సహాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్సై నాగేశ్వరరావు చేసిన సేవను అభినందిస్తూ, పోలీస్ శాఖలో ఇలాంటి సేవాభావం కలిగిన అధికారులు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మానవత్వంతో చేసిన ఈ చర్య సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఎస్సై నాగేశ్వరరావుపై ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచింది.









