కరకగూడెంలో అయ్యప్ప భక్తుల సహృదయ సహాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలో అయ్యప్ప భక్తులు తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అయ్యప్ప మాల ధరించే తమ సహచర మిత్రుడు అకాల మరణం చెందడంతో, అతని కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో, అయ్యప్ప సేవ చిన్ముద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో కరకగూడెం అయ్యప్ప భక్తులు కలిసి బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఐక్యతను, సేవాభావాన్ని ప్రతిబింబించింది.
ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో చందా మధు స్వామి, సోయం శ్రీను స్వామి, గుమ్మడవెల్లి శ్రీను స్వామి, గుమ్మడవెల్లి కృష్ణ స్వామి, ఎల్లు సోమిరెడ్డి స్వామి, రావుల కనకయ్య స్వామి, వైద బిక్షపతి స్వామి, ఆకుల నాగరాజ్ స్వామి, శిరిశెట్టి కమలాకర్ స్వామి, యాగ్గడి శ్రీను స్వామి, చిట్టి శ్రీను స్వామి, బైర్శెట్టి హేమంత్ స్వామి, భైరశెట్టి ధనుంజయ స్వామి, సిరి శెట్టి ప్రణయ్ స్వామి, తిప్పని సాయి స్వామి, చిట్టి శ్రీకాంత్ స్వామి, బుడగం పవన్ స్వామి, ప్రణయ్ అయ్యాగారు స్వామి, సాయి కిషోర్ స్వామి, ఎర్ర రాకేశ్ స్వామి, ముట్టని శివ స్వామి తదితరులు ఉన్నారు.
ఇప్పటివరకు మొత్తం 22 మంది భక్తులు సహాయం అందించగా, మరికొందరు కూడా తమకు తోచినంత సహాయం చేయాలని అయ్యప్ప స్వామి గ్రూప్ సభ్యులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా భక్తులు “స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప” అంటూ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.









