మహబూబాబాద్ జిల్లాకు గర్వకారణం – అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న కానిస్టేబుల్ లింగయ్యకు అభినందనలు
మహబూబాబాద్, మార్చి 31 ఆధాబ్ న్యూస్:
క్రీడల్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ మహబూబాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఎం. లింగయ్యను ఈ రోజు అధికారులు, సహచరులు అభినందించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన పి.సి. 182 లింగయ్య పలు ప్రతిష్టాత్మక పరుగుపందేలలో విశిష్ట విజయాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు:
లింగయ్య చండీగఢ్ ఇంటర్నేషనల్ మారథాన్ (21 కి.మీ)లో 1:12:00 సమయంతో 3వ స్థానం, ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్ (42.195 కి.మీ)లో 2:44:00 సమయంతో 4వ స్థానం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్ (10 కి.మీ)లో 32:57 సమయంతో 1వ స్థానం సాధించారు.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ:
ఆల్ ఇండియా పోలీస్ ఫుల్ మారథాన్, జలంధర్‌లో 2:39:00 సమయంతో 5వ స్థానం, ఇండియన్ నేవీ మారథాన్, విశాఖపట్నంలో 1:12:00 సమయంతో 1వ స్థానం, వైజాగ్ మారథాన్‌లో 1:13:00 సమయంతో 3వ స్థానం సాధించారు.
పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో రాణింపు:
హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఫుల్ మారథాన్‌లో 2:40:00 సమయంతో 1వ స్థానం, క్రాస్ కంట్రీ (10 కి.మీ)లో 33 నిమిషాలతో 2వ స్థానం, 10,000 మీటర్ల పరుగులో 34 నిమిషాలతో 2వ స్థానం సాధించారు.
రాష్ట్ర స్థాయిలో కూడా సత్తా:
తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ (10 కి.మీ)లో 32 నిమిషాలతో 3వ స్థానం, యాదగిరిగుట్ట టెంపుల్ రన్ (21 కి.మీ)లో 1:12:00 సమయంతో 1వ స్థానం, కరీంనగర్ హాఫ్ మారథాన్‌లో 1:14:00 సమయంతో 3వ స్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని థానుకూ రోడ్ రన్ (10 కి.మీ)లో 31:56 సమయంతో 1వ స్థానం సాధించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, లింగయ్య సాధించిన విజయాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.









