చల్లపల్లి పోలీస్ వాహనంలో అగ్నిప్రమాదం – నలుగురికి తీవ్ర గాయాలు
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
చల్లపల్లిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తున్న సమయంలో పోలీస్ వాహనంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది.
సమాచారం ప్రకారం, టపాసులు అకస్మాత్తుగా పేలిపోవడంతో పోలీస్ జీప్‌లో భారీ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో ఎస్సై దుర్గ వీరాంజనేయులు సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో డ్రైవర్ నాగరాజు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ తేజ ఉన్నారు.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Post Views: 14









