ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో కోనేరు సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి రైతు వేదికలో ఈ రోజు కోనేరు సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సమావేశంలో మండల కోఆర్డినేటర్ పగుట్ల వెంకటేశ్వరరావు ఫోకస్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (FDP)లో భాగంగా గ్రామపంచాయతీలలో అమలు చేస్తున్న జీవనోపాధి కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు. చిన్న, సన్నకారు రైతులకు అందిస్తున్న ఎత్తిపోతల పథకం, సమీకృత వ్యవసాయ విధానాలు, ఉద్యానవన పంటల ప్రోత్సాహం, న్యూట్రీ గార్డెన్లు, APCలు, విత్తన బ్యాంకులు, సహజ జీవ వనరుల తయారీ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను PPT ద్వారా వివరించారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఏర్పాటు చేసి వారికి శిక్షణలు అందిస్తున్నామని తెలిపారు.

ఇక 2026–2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా సమగ్ర ప్రణాళికను వివరించారు.

ఈ సందర్భంగా మండల MPDO దేవవర కుమార్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను వివరించి, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ చటర్జీ, ఆర్‌ఐ కిరణ్, SERP APM వినోద్ క్రాంతి, ఎలక్ట్రికల్ AE రాజశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే పద్మాపురం, తాటిగూడెం, రేగళ్ళ, చిరుమళ్ళ, అనంతారం, కన్నాయిగూడెం గ్రామాల సర్పంచులు, సెక్రెటరీలు, కోనేరు సంస్థ సిబ్బంది మరియు రైతులు హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!