ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఘనంగా టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరకగూడెంలో ఘనంగా టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండల కేంద్రంలో  టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు చందా రాఘవులు, పాయల్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ స్థాపన ప్రాధాన్యత, పార్టీ అభివృద్ధి ప్రయాణంపై వారు ప్రసంగించారు.

అలాగే ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు సిరిశెట్టి సాయితేజ తదితరులు పాల్గొని పార్టీ పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్