ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  పేరంటాల చెరువు వద్ద “స్వచ్ఛ తెలంగాణ–క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పేరంటాల చెరువు వద్ద “స్వచ్ఛ తెలంగాణ–క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

బూర్గంపహాడ్, మార్చి 28 (ఆధాబ్ న్యూస్):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీజీ ఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండల పరిధిలోని పేరంటాల చెరువు వద్ద టీజీ ఎస్పీఎఫ్ బీటిపిఎస్ యూనిట్ ఆధ్వర్యంలో “స్వచ్ఛ తెలంగాణ–క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చెరువు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా, ఒకచోట చేర్చి సరైన విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లో కలవడం వల్ల నీటిని తాగే జీవులు అనారోగ్యానికి గురవుతున్నాయని, భూసారం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం, మండలం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమేష్, చందు, సర్పంచ్ ఉషారాణి, ఉప సర్పంచ్ రమేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….