ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కొడుకుని కాపాడి తల్లి ప్రాణత్యాగం – మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన

కొడుకుని కాపాడి తల్లి ప్రాణత్యాగం – మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన

మార్కాపురం, ఆధాబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలను త్యాగం చేసిన సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

వివరాల్లోకి వెళితే… కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45) తన కుమారుడు మనోహర్‌తో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ప్రయాణం జరుగుతున్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రమాదాన్ని గుర్తించిన రమాదేవి, తన కుమారుడిని వెంటనే కిటికీ ద్వారా బయటకు తోసి అతని ప్రాణాలను రక్షించారు. అయితే మంటలు క్షణాల్లోనే ఉద్ధృతంగా మారడంతో ఆమె బస్సులోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు. కొడుకు కళ్లెదుటే తల్లి ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

తల్లి ప్రేమ, త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన గ్రామస్థులను కన్నీళ్లు పెట్టించింది. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….