ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం గ్రామంలో ఘనంగా రామాలయ విగ్రహ ప్రతిష్ట, ద్వజస్థంభ స్థాపన

అనంతారం గ్రామంలో ఘనంగా రామాలయ విగ్రహ ప్రతిష్ట, ద్వజస్థంభ స్థాపన

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ద్వజస్థంభ స్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్యకార్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి, మాజీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవాలయ అభివృద్ధి కోసం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అనంతారం గ్రామ సర్పంచ్ పాయం కృషవేణి, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్