కరకగూడెంలో ఉచిత వైద్య శిబిరం
కరకగూడెం,మార్చి10, ఆధాబ్ న్యూస్ ,:తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్‌ను మార్చి 11న పీహెచ్‌సీ కరకగూడెంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, డెంటల్ విభాగాల నిపుణ వైద్యులు సేవలు అందించనున్నారు.
శిబిరం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ పి. రవితేజ తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కోరారు.
Post Views: 59









