ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం – తెలంగాణ ప్రభుత్వం

వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం – తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. హీట్‌వేవ్, సన్‌స్ట్రోక్ కారణంగా జరిగే మరణాలను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా గుర్తించింది.

వడదెబ్బతో ఎవరైనా మరణించారని అనుమానం వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి అని అధికారులు తెలిపారు. అనంతరం మరణ ధృవీకరణ పత్రం మరియు పోస్టుమార్టం రిపోర్టుతో దరఖాస్తు సమర్పిస్తే సంబంధిత అధికారులు పరిశీలించి నష్టపరిహారం మంజూరు చేస్తారు.

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్నం వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!