ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్… నలుగురు విద్యార్థులు అస్వస్థత

మణుగూరులో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్… నలుగురు విద్యార్థులు అస్వస్థత

మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరులోని మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో భోజనం చేసిన అనంతరం నలుగురు విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు.

తక్షణమే స్పందించిన పాఠశాల అధికారులు విద్యార్థులను మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!