🕉️ సీతారాంపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచులు పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, గొగ్గలి రవి, భూక్య రాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, దెంచనల రాజేంద్ర ప్రసాద్, దుర్గం కన్నయ్య, కరకపల్లి నాగేష్ పాల్గొన్నారు.
అలాగే సర్పంచులు తోలెం రమాదేవి (బట్టుపల్లి), కొమరం సుగుణ (చిరుమల్ల), చౌలం కేశవరావు (వెంకటాపురం), పోలేబోయిన సుజాత (కరకగూడెం), ఎర్రం పొట్టయ్య (కొత్తగూడెం), తోలెం రమేష్ (పద్మాపురం), ఉప సర్పంచులు గాందర్ల రామనాథం (తాటిగూడెం), ఇర్రి వెంకన్న (బట్టుపల్లి)తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన కళ్యాణ మహోత్సవం సీతారాంపురం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.









