ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఘన సన్మానం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఘన సన్మానం.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లుతున్న జితేష్ వి పాటిల్‌ను పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ఘనంగా సన్మానించారు.

జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, అశ్వరావుపేట, బూర్గంపాడు, ఇల్లందు, చర్ల ప్రాంతాల ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్లు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్‌కు గజమాలలు వేసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, సేవల విస్తరణ, ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిపారు.

జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లా ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్లే ఆరోగ్య రంగంలో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని అభినందించారు.

కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్